న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలనుండి అంధ్రరాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ నందు ఈనెల 15 న ప్రమాణ పత్రాలు పొందినవారిలో మొత్తం 300 మంది కి కాగా అందు ఉమ్మడి రెండు రాష్ట్రాలకు గాను ఏకైక ఆదివాసీ బిడ్డగా పెలుమాల లోక చందన ఘనత సాధించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టుకు చెందిన లింగమూర్తి కుమార్తె ఈ లోక చందన. కాగా ఇది గిరిజన వాసులకు చాలా గర్వకారణమని భారత్ జోడో యాత్రలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంత కుమారి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.