అకాల వర్షాల వల్ల పల్నాడు జిల్లా రైతులకు భారీ నష్టం జరిగిందని సోమవారం వినుకొండ టీడీపీ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు రైతులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్న ధాన్యానికి ఇంతవరకు రైతులకు డబ్బులు ఇవ్వలేదు అన్నారు. రైతుల పండించిన పంటను అమ్ముకోవాలంటే వైసీపీ నాయకులు లంచం ఇస్తే తప్ప అమ్ముకొనే పరిస్థితి లేదన్నారు. కౌలు రైతులను పూర్తిగా వైసిపి ప్రభుత్వం నట్టేట ముంచిందని అన్నారు.