ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని వైసీపీ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆరోపించారు. విజయవాడ మూడవ డివిజన్ లో సోమవారం ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుళ్లు రాజకీయాలు చేసిన మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.