ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడు పోయాడు: మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 04:55 PM

విశాఖ గర్జన పై మంత్రి రోజా సోమవారం విలేకర్ల నగరిలో మాట్లాడుతూ నాడు పవన్ కళ్యాణ్ అమరావతిని టీడీపీ రాజధాని అని వ్యాఖ్యానించింది. మరిచి నేడు విశాఖ, కర్నూల్ ప్రాంతాలకు వ్యతిరేఖంగా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీకి అమ్ముడు పోయాడన్న విషయం అర్థమవుతుందని పవన్ కళ్యాణ్ చేపట్టిన జన వాణి కార్యక్రమంలో ఎక్కడా కూడా ర్యాలీ చేపట్టకుండా వైజాగ్ లో మాత్రం ర్యాలీ చేపట్టడం వెనుక కుట్ర ఉందని, జనసేన నాయకులు అరైవల్స్ లో ఉండాల్సింది పోయి వైసీపీ నాయకులు, మంత్రులు వెళ్ళే కాన్వాయ్ దగ్గరికి ఎందుకువచ్చారని? , ముమ్మాటికీ పవన్ కళ్యాణే వారి జన సైకోలను రెచ్చగొట్టి పంపించాడనే విషయం అందరికి అర్థమవుతుందని దాడిలో తన సిబ్బందికి గాయాలయ్యి 10 కుట్లు పడిందని, చంద్రబాబు నాయుడు, బీజేపీ వాళ్లు దాడికి గురయ్యిన తమని కాకుండా దాడి చేసిన పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి పరామర్శించడం విడ్డూరమన్నారు. మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదమని వారి తండ్రి ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరిన వ్యక్తులకు వత్తాసు పలకడం చాలా బాధాకరమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com