నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయం కార్యక్రమంలో మంత్రి కాకాని గోవెర్దన్ రెడ్డి మాట్లాడుతూ...... మ్యానిఫెస్టోలో చెప్పినదానికన్నా ఎక్కువగా ఇచ్చిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారే, రైతులకు అనేక పథకాలు అమలవుతున్నాయి, ఉచిత పంటల బీమా ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రైతాంగానికి అండగా నిలిచి, దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ కార్యక్రమం అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం మనది. విత్తనం నుండి విక్రయం వరకు ఆర్బీకేలు రైతాంగానికి అండగా ఉంటున్నాయి, రైతులకు ఈ క్రాప్ బుకింగ్ కానీ ఈ కేవైసీ కాని, ఎరువులు, విత్తనాలు, ఉత్పాదకాల నాణ్యతను పరిక్షించడానికి 147 అసెంబ్లీ స్ధాయిలో ల్యాబులు, 13 జిల్లా స్ధాయిలో, 4 రీజనల్ కోడింగ్ సెంటర్స్ ఏర్పాటుచేయడం జరిగింది. వైఎస్‌ఆర్ పొలంబడి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగానికి అందజేస్తున్నాం, వ్యవసాయ సలహా మండలి ఏర్పాటుచేసి సచివాలయం, మండలం, జిల్లా స్ధాయిలో దాదాపు లక్షమంది రైతులతో ఏర్పాటుచేసిన ప్రభుత్వం మనది. వ్యవసాయ రుణాలు అత్యధికంగా ఇవ్వడం జరిగింది, టీడీపీ హయాంలో రైతు రధం పేరుతో దోచుకున్న చరిత్ర, కానీ ఇప్పుడు మీరు ఎంపిక చేసుకున్న మోడల్‌ను నేరుగా ఇచ్చిన ఘనత ఈ సీఎంగారిది. త్వరలోనే దాదాపు రూ. 200 కోట్లతో డ్రోన్లను కూడా ఏర్పాటుచేసి రైతాంగానికి అండగా ఉండాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. రైతాంగానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సాయం చేస్తున్నాం. ఈ మూడేళ్ళలో ఒక్క కరవు మండలం కూడా ప్రకటించలేదు, కానీ చంద్రబాబు కరవు కవలపిల్లలు కాబట్టి వందల సంఖ్యలో ప్రకటించారు. సీఎంగారు ఎప్పుడూ చెప్పే మాట రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించి ఆ విధంగా అడుగులు వేస్తున్నారు, సీఎంగారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మీ అందరూ ఆశీస్సులు అందించాలని కోరుతున్నాను అని తెలియజేసారు.