వేపచెట్టు నుంచి పాలు వస్తున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగరౌలీ జిల్లా నిగాహి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ వేపచెట్టు నుంచి పాలు ద్రవం రూపంలో కారడంతో అది చూసి భక్తులు ఇది షీత్లా మాత మహిమేనని చెబుతున్నారు. ఈ వేప చెట్టుకు చాలా ఏళ్ల నుంచి పూజలు చేస్తున్నామని, అందుకే వేప చెట్టు నుంచి వచ్చే ఆ పాలు తాగితే రోగాలన్నీ మాయమవుతాయని భక్తులు అంటున్నారు.