స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న వినతులను వేగంగా పరిష్కరించాలని నగర కమిషనర్ డా. జె అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో అందిన వినతులపై సంబంధిత విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ప్రధానంగా వైయస్సార్ నగర్లో మౌలిక వసతులు కల్పించాలని స్థానిక ప్రజలు వినతిపత్రం అందించారు. పాంచాలపురంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, జోగుల కాలనీలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని వినతులు అందాయి. స్పందన కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం 7, పట్టణ ప్రణాళిక విభాగం 3, ప్రజారోగ్య విభాగం -2, అకౌంట్స్ విభాగం 1 చొప్పున మొత్తం 13 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంహెచ్వో అనిల్ కుమార్, ఎంఈ ధనలక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.