రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల సంక్షేమం కోసం ప్రతిషాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పథకాలను విమర్శించే స్థాయి జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అర్హత లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వెదురు కుప్పం మండలం మాంబేడు పంచాయతీలో ప్రజా సంక్షేమం గురించి ఆరా తీస్తూ ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు రాధాకృష్ణ రామోజీ కుమ్మక్కై సీఎం జగన్ పైన విమర్శిస్తున్నారని. వారికి సత్తా ఉంటే నవరత్నాల కంటే ఇంకా ఏదైనా పథకాలు గొప్పగా ఉంటాయా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఉందా చూపించాలని సవాలు విసిరారు. సీఎం జగన్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల విక్రంద్రికారణ గురించి ఆలోచిస్తున్నారని అయితే దాన్ని సైతం ప్రతిపక్ష నాయకులు విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు.