ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంలోని క్యూ లైన్ లన్నీ భక్తులతో నిండిపోయింది. స్వామి వారి దర్శనార్థం సమయపాలన కావడంతో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో రాణా ప్రతాప్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.