ఈ నెల 20వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి , అవనిగడ్డ పర్యటన సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా , అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు , జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల గార్లతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించారు. వేకనూరు గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ఏర్పాట్లు పనులు పరిశీలించిన కలెక్టర్ . హెలిప్యాడ్ వద్ద అవసరమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు . ముఖ్యమంత్రి సభా కార్యక్రమానికి కోడూరు , నాగాయలంక , అవనిగడ్డ , మోపిదేవి , ఘంటసాల , మొవ్వ , మచిలీపట్నం మండలాల నుంచి లబ్దిదారులను గౌరవ ముఖ్యమంత్రి సభా కార్యక్రమానికి హాజరయ్యేందుకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయాలన్నారు . సభా ప్రాంగణం పరిశీలించిన కలెక్టర్ , వేదిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు . డైయాస్ పై పది మంది రైతులకు నిషేధిత భూముల తొలగింపు పత్రాలు ముఖ్యమంత్రి చేతుల మీదగా ఇప్పించుటకు ఏర్పాట్లు చేయాలన్నారు . ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు , జిల్లా పరిషత్ సీ . ఈ . ఓ . జి . శ్రీనివాసరావు , డ్వామా పీ . డీ . జి . వి . సూర్యనారాయణ , ఆర్ . డీ . ఓ . లు , తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు .