రవాణా పన్నులు వసూలు చేయటం, రవాణా పన్నులు పెంచటం, పెట్రోల్ డీజిల్ మీద దేశంలో 28 రాష్ట్రాలు సుంఖం తగ్గించినా ఈ రాష్ట్రంలో అధిక బాదుడు బాధ తెలుసు కానీ గ్రామాలను కలిపే ప్రధాన రహదారులు రోడ్లు వేయటం తెలియదు కనీసం గుంటలు పూడ్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రి జగన్, చేతకాని మంత్రులు అని టీడీపీ నాయకులూ ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ... చేబ్రోలు మండలం బ్రాహ్మణ కోడూరు అడ్డరోడ్డు నుండి తోట్లపాలెం వెళ్ళు ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టి ప్రజా రవాణా కు సహకరించాలని డిమాండ్ చేసారు.