కడప తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో వివాహిత (32) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పదేళ్ల కిందట వివాహమైంది. తాలూకా పరిధిలో కాపురముంటున్నారు. రెండు రోజుల కిందట వివాహిత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. చుట్టు పక్కల గాలించినా కనిపించలేదు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.