తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకు 11 అర్జీలు అందినట్లు సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి అడంగల్ సరిదిద్దుటం పై రెండు, 1బి అడంగల్ పై ఒకటి, సర్వే ధ్రువీకరణ కోరుతూ ఒక అర్జీ దాఖలు కాగా సంక్షేమ పథకాలకు సంబంధించి మూడు, మరో నాలుగు అర్జీలు ఇతర సమస్యలపై వచ్చాయని వివరించారు. అర్జీలను పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపిస్తామన్నారు.