ఒంగోలు: రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుందని, అందుకోసం ప్రతి కార్యకర్త బూత్ లెవెల్ నుంచి కష్టపడి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో పలు క్లస్టర్ల పరిధిలోని బూత్ ఇన్చార్జీలు, యూనిట్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. వారానికి ఒకసారి ప్రతి ఓటరును కలిసి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రతిని వివరించాలని తెలిపారు.