గుజరాత్ లోని దాహోద్ జిల్లాలో విషాదం జరిగింది. దేవగఢ్ బరియా గ్రామానికి చెందిన రమేష్ వంజరకు 51 సంవత్సరాలు. ఓ ఈవెంట్ లో ఆయన సరదాగా గడుపుతూ డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. దీంతో అక్కడ విషాద చాయలు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.