ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేరస్తుడి పాలనలో రాష్ట్రం నాశనమౌతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 18, 2022, 12:50 PM

అమరావతి రైతులపై వైసీపీ  దాడి హేయమైన చర్య అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు  విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా తెలియజేసారు. ఈ దాడి  జగన్ రెడ్డి  అరాచక పాలనకు అద్దం పడుతుందన్నారు. నేరస్తుడి పాలనలో రాష్ట్రం నాశనమవుతోందన్నారు. ఎంపీ భరత్ , పిల్లి సుభాష్ చంద్రబోస్  ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరిచి వ్యవహరించారని మండిపడ్డారు. పట్టపగలు రైతులపై పెట్రోల్ సీసాలు, బీరు సీసాలు, కర్రలతో దాడి చేస్తున్నా పోలీసులకు పట్టదా అని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో జరుగుతున్న పాదయాత్రకు రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఎంపీ మార్గాని భరత్‌తో పాటు దాడిలో పాల్గొన్న వైసీపీ నేతలందరి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు  డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com