2019 ఎన్నికల ముందు వరకు అమరావతి అసలు రాజధానే కాదని, అది ఒక కుల రాజధాని, అది అందరి రాజధాని కాదు అని.. పవన్‌కళ్యాణ్, లోక్‌సత్తా జయప్రకాశ్‌నారాయణ, సీపీఎం, సీపీఐ, బీజేపీకి సంబంధించిన ఐవైఆర్ కృష్ణారావు కూడా అన్నారు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అయన మీడియా తో మాట్లాడుతూ... అమరావతి చంద్రబాబు దోపిడీకి ఆలవాలం. అది కేవలం ధనిక వర్గానికి లేదా ఒక కులానికి సంబంధించిన రాజధాని అని వారంతా అన్నారు. మళ్లీ వారే ఇవాళ ఏమంటున్నారు?. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలులో హైకోర్టును వ్యతిరేకిస్తున్నామని, అన్నీ ఇక్కడే ఉండాలని మాట మార్చిన దరిమిలా.. ఆవేదనకు లోనైన ఉత్తరాంధ్ర ప్రజలు.. మరీ ప్రత్యేకించి డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్‌కు వెళ్లి తొడ గొట్టిన చందంగా, అమరావతి నుంచి వైజాగ్ వెళ్లి, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరం లేదని.. అంతా తమకే కావాలని తొడ గొట్టే పరిస్థితి ఉంటే వారిలో భావోద్వేగం పెరగదా? అని ప్రశ్నించారు.