ఇస్తాంబుల్ నుంచి ఇండోనేషియాలోని జకార్తాకు పయమైన టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో ఇటీవల ఓ ప్రయాణికుడు హంగామా చేశాడు. మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. ఫ్లైట్ అటెండెంట్ వచ్చి వారించగా అతడి వేలు కొరికేశాడు. దీంతో విమానాన్ని మెడాన్లోని కౌలానాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది.