క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా, ఈ నిర్ణయం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వన్డే అంతర్జాతీయ ఫార్మాట్‌లో కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్న సందిగ్ధతకు తెరపడింది. ఆరోన్ ఫించ్ వారసుడిని ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేసింది. కెప్టెన్ పేరును కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. వన్డే ఫార్మాట్‌కు కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించారు. కమిన్స్ ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టెస్టుల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తోండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. స్టీవెన్ స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నారు.
క్రికెట్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. వన్డే ఫార్మాట్‌కు కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించారు. కమిన్స్ ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టెస్టుల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తోండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. స్టీవెన్ స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నారు.