కర్ణాటకలోని హోసకోటేలో దారుణం జరిగింది. రమేష్, అర్పిత ఏడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనుమానంతో రమేష్ వేధించేవాడు. కొన్నాళ్లుగా వీరికి గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరు పిల్లలను తీసుకుని అర్పిత పుట్టింటికి వెళ్లిపోయింది. కలిసి ఉందామని రమేష్ ఆమెను శనివారం పిలిచాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్యను 15 సార్లు పొడిచాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితురాలు చనిపోయింది.