మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా లవ్కుష్నగర్లోని అక్టోహాన్ ప్రాంతంలో ఆదివారం అమానవీయ ఘటన జరిగింది. అజిత్ రాజ్పుత్ అనే వ్యక్తి ఫోన్ పోయింది. దానిని దొంగిలించాడనే నెపంతో 12 ఏళ్ల బాలుడిపై అజిత్ దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొట్టి, బావిలో వేలాడదీశాడు. తాను దొంగతనం చేయలేదని ఆ బాలుడు ఎంత రోదించినా నిందితుడు వినలేదు. ఈ దారుణాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి, బాలుడి తల్లిదండ్రులకు పంపించాడు. దీంతో సోమవారం నిందితుడిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.