అమరావతి రైతుల పాదయాత్రను రాజమహేంద్రవరంలో మంగళవారం వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పరస్పరం రాళ్లు, వాటర్ బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. పోటీపోటీగా ఇరువర్గాలు నినాదాలు చేశాయి. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆజాద్ చౌక్ ప్రాంతానికి పాదయాత్ర రాగానే నల్ల బెలూన్లతో వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.