స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్. పి రిషాంత్ రెడ్డి, మరియు అడిషనల్ ఎస్పీ ఆదేశించారు. చిత్తూరు స్థానిక పోలీసు జిల్లా శిక్షణ కార్యాలయం ఆవరణంలో సోమవారం ఎస్పి స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్. పి ని మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పి. జగదీష్ ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరిత గతిన విచారణ జరిపి ఫిర్యాదు దారులకి న్యాయం చేయాలని సంభందిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 27 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.