నరసరావుపేట పట్టణంలోని వాలంటీర్ జిలాని ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఓ మహిళను లోబర్చుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగి తీసుకున్న ఫోటోలను భర్తకు చూపించాడు. ఈ నేపథ్యంలో మహిళను భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. మహిళ జిలాని తనను పెళ్లి చేసుకోవాలని కోరగా తన తల్లి చెప్తేనే చేసుకుంటానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మహిళ వాపోతోంది. పోలీసులకు చెప్పిన పట్టించుకోవడంలేదని మహిళ వాపోయింది.