రాష్ట్రంలో ఈ నెల14 నుండి కొనసాగుతున్న రాహుల్ గాంధీ జోడో పాదయాత్రలో పాల్గొనేందుకు మంగళగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. 19వ తేదీన ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమై 21వ తేదీన మంత్రాలయం వరకు జరిగే రాహుల్ గాంధీ పాదయాత్రలో నాయకులు పాల్గొంటారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు గోలి నాగ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కుర్రా పున్నారావు, నాయకులు కూర్మాల దుర్గాప్రసాద్, రేమినిశెట్టి హనుమంతరావు, గోలి సాంబశివరావు, దేశబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.