విజయవాడలో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ 'విశాఖలో పవన్ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధ, ఆవేదన కలిగించాయి. అందుకే పవన్ ను పరామర్శించేందుకు వచ్చాను. పోటాపోటీ సమావేశాలు ఉన్నప్పుడు పోలీసులు ప్లాన్ చేసుకోవాలి. వైసీపీ వాళ్లు దారుణంగా ప్రవర్తించారు. వాళ్లపై వాళ్లే దాడులు చేసుకుని టీడీపీ, జనసేన కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం. నడిరోడ్డుపై నిలబెట్టి పవన్ ను వేధించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాజకీయ పార్టీ నేతలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఏది. అన్ని పార్టీలతో మాట్లాడుతాం. అవసరమైతే మళ్లీ కలుస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. పవన్ పై ప్రభుత్వం తీరు సరికాదు' అని అన్నారు.