శ్రీకాకుళం: శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులపై వైసీపీ నాయకులే దాడికి దిగడం జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడని, నేరస్తుడి పాలనలో ఆంధ్రప్రదేశ్ నాశనమవుతున్న విషయం మరోసారి ఈ సంఘటన ద్వారా బహిర్గతమైందన్నారు. అమరావతి రైతులపై చెప్పులు , కర్రలతో జరిగిన దాడులపై ఆయన మండిపడ్డారు.