అనంతపురం జిల్లా, శెట్టూరు మండల పరిధిలోని జోగినీల జీవన స్థితిగతిలపై జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS సమీక్ష చేశారు. ఆయన శెట్టూరు పోలీసు స్టేషన్ ను తనిఖీ చేశారు. అనంతరం మండల పరిధిలో ఉన్న జోగినీలతో సమావేశమయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితులు, జీవన స్థితిగతులపై ఆరా తీశారు. ప్రభుత్వం నుండీ అందాల్సిన ఫెన్సన్, రేషన్ , తదితరాలు సక్రమంగా అందుతున్నాయా లేదని అడిగి తెలుసుకున్నారు. ఇంకా వారు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను సైతం తెలుసుకుని సంబంధిత విభాగం అధికారులతో మాట్లాడారు. కంటి& ఇతర ఆరోగ్య సమస్యలుంటే తెలియజేయాలని సూచించారు.