అమరావతి రైతుల పాదయాత్రలో భాగంగా నిన్న రాజమండ్రిలో , రైతులకి ,వైసీపీ నాయకులకి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.... వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరే రెచ్చగొట్టి, మీరే మీ గూండాలతో రైతులపై హత్యాయత్నం చేసి, ఎదురు సామాన్యులపై తప్పుడు కేసులు బనాయించి, మహిళలను రైతులను బెదిరించి, అమరావతి రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి మొదటి నుండీ మీరు చేస్తున్న ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్ట వేసినా తిరిగి అదే పని చేస్తున్నారు. ఈరోజు రైతులపై హత్యాయత్నం కు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేసారు.