గుంటూరు సర్వజన ఆస్పత్రిలో త్వరలో కాలేయ మార్పిడి శాస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో శిక్షణ పొందేందుకు ఇద్దరు సహాయ ఆచార్యులను మంగళవారం ఎంపిక చేశారు. తొలివిడతగా జనరల్ సర్జరీ నుంచి సిహెచ్ శ్రీనివాసరావు, మత్తు వైద్యం విభాగం నుంచి ప్రవీణ్ కుమార్ నాయక్ ఈనెల 23వ తేదీ వరకు చెన్నైలో చికిత్స మెలకువలు నేర్చుకోనున్నారు.