ఏపీలో భారత జోడో యాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా, పోలవరం హామీలను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలన్నారు. ఏపీలో ఏకైక రాజధాని అమరావతికే తమ పార్టీ మద్దతు ఉంటున్నారు. ఏపీలో పార్టీలు రాజకీయాలను బిజినెస్‌లా మార్చాయన్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా సాగాయన్నారు.