వైద్య, విద్యా ప్రమాణాల పెంపు చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ తో పాటు నిఘా కెమెరాల ఏర్పాటులో గుంటూరు వైద్య కళాశాల రాష్ట్రంలో మొదటిది కాగా, దేశవ్యాప్తంగా ఏడోదిగా గుర్తింపు పొందింది. ఇందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్ పద్మావతి తో కేంద్రా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి మన్ సుఖ్ మాండవియా ఇటీవల స్వయంగా మాట్లాడి ఆమెను అభినందించారు.