ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే గెలుపొందారు. ఎన్నికల్లో ఆయన భారీ విజయం సాధించారు. ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్ధి శశిథరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను పార్టీ ఎన్నికల నిర్వాహకులు ప్రకటించారు. 24 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గాంధీయేతర వ్యక్తిగా ఖర్గే నిలిచారు.