స్వీడన్లోని ఇటీవల ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో 26 ఏళ్ల రోమినా పూర్మోఖ్తరిని మంత్రి పదవి వరించింది. ఆమె మంగళవారం వాతావరణ మంత్రిగా నియమితులయ్యారు. దేశంలో మంత్రిత్వ శాఖ చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా రోమినా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఆమె లిబరల్ పార్టీ యువజన విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు. స్వీడన్ కొత్త ప్రభుత్వంలో ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో సహా 23 మంది మంత్రులు ఉన్నారు.