జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బొత్స అన్నారు. అసలు జనసేన రాజకీయ పార్టీ కాదని అది ఒక సెలబ్రిటీ పార్టీ అని బొత్స అన్నారు. పవన్ వ్యాఖ్యలు హద్దులు దాటాయని అన్నారు. ర్యాలీ నిర్వహించేందుకు పవన్ అనుమతి తీసుకుని ఉంటే.. పోలీసులు రూట్ మ్యాప్ ఇచ్చి ఉండేవారన్నారు. వపన్ విశాఖ వచ్చిన రోజే గంటన్నర ట్రాఫిక్ లో చిక్కుకుపోయానని బొత్స అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని.. ఈ విషయంలో తమకు పవన్ సలహా అవసరం లేదని బొత్స అన్నారు.