ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సారధ్యంలో బుధవారం శ్రీనగర్, అశోక్ నగర్ వీధి ఏరియాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న ప్రభుత్వం ప్రజలకు అందించిన సహాయాన్ని గుర్తు చేస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరినీ పలకరిస్తూ ఈ 3ఏళ్ల పాలనలో మీరు సంతృప్తిగా ఉన్నారా, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలుపండి తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మరోసారి వైసీపీని గెలిపించాలని జగన్ను సీఎంను చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ శివ ప్రసాద్, 27వ వార్డ్ ప్రెసిడెంట్ నీలాపు సర్వేశ్వర రెడ్డి, 31వ వార్డ్ కార్పొరేటర్ శ్రబిపిన్ కుమార్ జైన్ పాల్గొన్నారు.