గర్భిణీలు ఆరోగ్య నియమాలు పాటించేలా చూడాలని తలుపుల పీ. హెచ్. సి వైద్యాధికారి డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. బుధవారం పీలేరు పంచాయతీ ఆఫీసులో జరిగిన గర్భిణీ స్త్రీలు-నవజాతి శిశువుల ఆరోగ్య పరీక్షలు కార్యక్రమాన్ని సందర్శించి సూచనలు ఇచ్చారు. గర్భిణి స్త్రీలు సంపూర్ణ మాతృత్వ ఆనందాన్ని పొందాలంటే గర్భిణీ కాలంలో ఆరోగ్య నియమాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఈ కొండయ్య, పర్యవేక్షకులు కుసుమ తదితరులు పాల్గొన్నారు.