ఈ కేవైసీ చేసుకున్న వారికే ప్రయోజనాలు అందుతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ వీ. కోట మండలంలో 7674 మంది రైతులు ఉండగా 7216 మంది రైతులు ఈ కేవైసీ చేసుకున్నారని చెప్పారు. ఇంకా 458 మంది రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉందని చెప్పారు. మిగిలిన రైతులు వెంటనే ఈ కేవైసీ చేసుకోవాల్సిందిగా చెప్పారు. రైతు భరోసా సొమ్ము పంట నష్టపరిహారం అందాలంటే నమోదు అవసరమని చెప్పారు.