నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరుడు.. సీతారామిరెడ్డి ఇంట్లో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పేకాట భాగోతం సాగుతోంది అని పోలీస్ వారు తెలియజేసారు. ఎస్ఈబీ బృందం ఆకస్మిక దాడి నిర్వహించింది. పలువురు నేతలు, పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. సుమారు మూడు లక్షల పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబీ అదుపులో పలువురు ఉన్నారు. ముఖ్య నేతలను వదిలేసి, కేసు మాఫీకి రాజకీయ పెద్దలు యత్నాలు చేస్తున్నట్లు సమాచారం.