రాష్ట్రంలో రాజకీయ పరంగా జరుగుతున్నా పరిణామాలని దృష్టిలో పెట్టుకొని , జనసేన తో బీజేపీ పొత్తు కొనసాగుతుందని బీజేపీ ఏపీ కో-కన్వీనర్ సునీల్ ధియోధర్ మరోసారి స్పష్టం చేశారు. అయన మీడియాతో మాట్లాడుతూ...వైసీపీ - టీడీపీలు రెండూ దొంగల పార్టీలే అని అన్నారు. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. వైసీపీ గుండాయిజంపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కన్నా కామెంట్లపై సోము వీర్రాజు చెప్పారని... అంతకు మించిఏమి లేదని తెలిపారు. రోడ్ మ్యాప్ విషయమై ఎలాంటి గందరగోళం లేదన్నారు. విశాఖ ఘటన విషయంలో బీజేపీ నేతలు చాలా మంది పవన్‌తో మాట్లాడారని.. సంఘీభావం తెలిపారని అన్నారు. కుటుంబ, అవినీతి పార్టీలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తామని సునీల్ ధియోధర్ పేర్కొన్నారు.