కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో మూడో రోజు ప్రారంభమైంది. ఎమ్మిగనూరు మండలం బనవాసి నుంచి యాత్ర ప్రారంభమైంది. ముగతి గ్రామం వరకు పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 4 గంటలకు హాలహర్వి నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 6:30 గంటలకు కల్లుదేవకుంటలో కార్నర్ మీటింగ్ జరుగుతోంది. రాత్రి మంత్రాలయం మండలం చెట్నిహళ్లిలో రాహుల్ బస చేశారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని రాహుల్ నేడు దర్శించుకోనున్నారు.