రుచిగా ఉండి ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తీసుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదం, పిస్తా, జీడిపప్పు, డ్రైఫ్రూట్స్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. రోజూ ఉదయం నానబెట్టిన బాదం పలుకులు తినాలి. జీడిపప్పులో శరీరానికి కావాల్సిన మినరల్స్, అమైనో ఆమ్లాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పిస్తాల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని యాంటీఆక్సీడెంట్ల వల్ల మొటిమలు పోతాయి.