విశాఖపట్టణం జిల్లా, నక్కపల్లి మండలంలోని గొడిచెర్ల హైవే జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత మరణించడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... పాయకరావుపేట మండలం పెద్దిపాలేనికి చెందిన కురందాసు నాగలక్ష్మికి(35), నక్కపల్లి మండలం జానయ్యపేటకు చెందిన అప్పలరాజతో వివాహమైంది. వీరు జానకయ్యపేటలో నివాసం ఉంటున్నారు. నాగలక్ష్మికి ఆరోగ్యం బాగోకపోవడంతో తుని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆమె తండ్రి కుండల వెంకటేశ్వరరావు వచ్చారు.మోపెడ్‌పై తన కుమార్తెను తుని తీసుకెళ్తుండగా గొడిచెర్ల హైవే జంక్షన్ వద్ద విశాఖ నుంచి తునివైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెపై నుంచి లారీ దూసుకుపోవడంతో మరణించడం జరిగింది. ఆమె తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.