గురజాల: ఎక్కడైనా పోలీసులు, వైసీపీ నేతలు బెదిరిస్తే తిరుగుబాటు చేద్దాం. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తానని పార్టీ శ్రేణులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. గురజాలలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ నాయకులు దాడులు ఆపి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, టీడీపీ జోలికొస్ట్ ఖబడ్ధార్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. పల్నాడులో యరపతినేని శ్రీనివాసరావు అండగా ఉంటాడు అంటూ తెలిపారు.