నర్సీపట్నం పరిధిలోని లింగాపురం గ్రామస్థులు ఏ అవసరం వచ్చినా నర్సీపట్నం రావలసిందే. పిల్లల చదువు కోసం కూడా ఇటువైపే రావాలి. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండడంతో నదిలో నీరు ఎక్కువగా ప్రవహిస్తోంది. దాంతో పిల్లలు భయపడి పాఠశాలలకు వెళ్లడం లేదు. కొందరు ప్రాణాలరచేత పెట్టుకొని వేములపూడి మోడల్ స్కూల్కు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా గ్రామస్థులు, విద్యార్థులు నదిలో దిగి వినూత్నంగా నిరసన వ్యక్తంచేస్తున్నారు. ‘సీఎం సారూ, మా ఊరి వంతెనకు రహదారి వేయండి.. మీ పేరు చెప్పి చదువుకుంటాం’ అంటూ పిల్లలు మంగళవారం నిరసన వ్యక్తంచేశారు.