డిగ్రీ కాలేజీల్లో బోధించే గెస్ట్ లెక్చరర్ల పారితోషికాన్ని పెంచుతూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసిం ది. ప్రస్తుతం గంటకు రూ.200గా ఉన్న పారితోషికాన్ని రూ.400 చేసింది. కాగా నెలకు గరిష్ఠ పారితోషికం రూ.28వేలు దాటకూడదని స్పష్టంచేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హర్షం వ్యక్తంచేశారు.