రాష్ట్రానికి రూ.136 కోట్ల గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. ఏపీతో పాటు నాలుగు రాష్ట్రాలకు మొత్తం 1764 కోట్ల గ్రాంట్ విడుదల చేసినట్టు బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మహారాష్ట్రకు 799 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు 720 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు 109 కోట్లు కేటాయించింది. మిలియన్ ప్లస్ సిటీస్/పట్టణ సముదాయాలు (ఎంపీసీ/యూఏ)కు నిధులు సమకూర్చడానికి వ్యయ విభాగం ఈ గ్రాంట్ విడుదల చేసినట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విజయవాడ, విశాఖపట్నం నగరాలకు నిధులు విడుదల చేసింది.