తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి బోధనా సమయంలో కొందరు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు రాజకీయ ప్రచారం చేస్తున్న విషయం పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చింది. ప్రచార కార్యక్రమాలు బోధనకు అంతరాయంగా మారుతున్నాయని తెలిపింది. నిబంధనలు పాటించేలా చూడాలని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల డీఈవోలకు ఆ శాఖ కమిషనర్ ఎస్.సురే్షకుమార్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.