కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెడన నియోజకవర్గం పరిధిలోని గూడూరు మండలం ఐదుగుళ్ళపల్లికి చెందిన బెట్టి ప్రభు దీవెన ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.