రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలన్నింట్లోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా , ప్రతి అడుగూ ఎన్నికల దిశగా ఉండాలని అద్దంకి నియోజకవర్గం కార్యకర్తలతో సీఎం జగన్ అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికలు మరో 19 నెలల్లో రానున్న నేపథ్యంలో.. పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాలన్నారు. ఇదే విధంగా అన్ని నియోజక వర్గ నేతలతో భేటీ జరుగుతుంది అని తెలియజేసారు.